Thursday, May 2, 2024

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. చాపర్ లో CDS రావత్‌ !

చీఫ్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కుప్పకూలింది. తమిళనాడులోని కొయంబత్తూర్‌, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో విమానంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ఆర్మీ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. విల్లింగ్టన్‌ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్‌ హెలికాప్టర్‌.. కాసేపటికే ఓ హోటల్‌ సమీపంలో కూలినట్లు తెలుస్తోంది. ఘటనా సమయంలో చాపర్‌లో 14 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement