Sunday, December 8, 2024

ఐఎస్‌బీ, పీజీపీ స్టూడెంట్స్ఖ్ కి బంపర్‌ ఆఫర్.. భారీగా జాబ్స్ ఇస్తున్న బడా కార్పొరేట్లు..

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజి నెస్‌ (ఐఎస్‌బీ) పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌ మెంట్‌ (పీజీపీ) – 2022 విద్యార్థులకు ప్రాంగణ నియామకాల్లో మంచి అవకాశాలు లభించాయి. ప్రతిష్టాత్మక సంస్థలు ఆకర్షణీయ జీతభత్యాలతో ఉద్యోగాలు ఇచ్చేం దుకు ముందుకొచ్చాయి. ఈ బ్యాచ్‌ లో 9292 మంది విద్యార్థులు ఉండగా వారిలో 39 శాతం విద్యార్థినులు. కోవిడ్‌ నేపథ్యంలో హైదరాబా ద్‌- మొహాలీ ప్రాంగణాల విద్యార్థులకు వర్చుల్‌ విధానం లో ప్రాంగణ ఎంపికలు జరిగాయి. 270 కార్పొరేట్‌ సంస్థల నుంచి వీరికి 2,066 ఉద్యోగాలు లభించాయి. అంటే ఒక్కో విద్యార్థికి సగటున రెండు ఉద్యోగాలు లభించా యి. ఒక్కో విద్యార్థికి లభించిన సగటు వార్షిక వేతనం రూ.34.07 లక్షలుగా ఉంది. గత ఏడాది సగటు రూ.28.21 లక్షలతో పోల్చుకుంటే ఈసారి జీతభత్యాలు 20.78 శాతం పెరిగినట్లు ఐఎస్‌బీ వెల్లడించింది. వారు ఐఎస్‌బీలో చేరక ముందు చేసిన ఉద్యోగాల్లో లభించిన వేతనం కంటే పీజీపీ కోర్సు పూర్తి చేశాక లభించిన వేతనంలో 173 శాతం పెరుగుదల కనిపించింది. మొత్తం నియామకాల్లో మహిళలకు 41 శాతం అవకా శాలు లభించాయి.

ఈ రంగాల కంపెనీలు..

కన్సల్టింగ్‌, ఐటీ, ఐటీఈఎస్‌, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌, ఔషధ, ఆరోగ్య రంగాలకు చెందిన అగ్రశ్రేణి కార్పొరేట్‌ కార్పొరేట్‌ సంస్థలు ఉద్యోగాలను ఆఫర్‌ చేశాయి. ప్రపం చ వ్యాప్తంగా ఉన్న 10 అత్యుత్తమ బిజినెస్‌ స్కూళ్లలో, ఒక బ్యాచ్‌లోనే 929 విద్యార్థులుండడం, ఐఎస్‌బీలోనే కావ టం మరొక ప్రత్యేకత. ఐఎస్‌బీ డిప్యూటీ డీన్‌ ప్రొ ఫెసర్‌ రమభద్రన్‌ తిరుమలై మాట్లాడుతూ ప్రముఖ సం స్థలతో పాటు అంకుర సంస్థలూ ప్రతిభగల మానవ వన రుల కోసం ఐఎస్‌బీఐని ఆశ్రయిస్తున్నామని తెలిపారు. పీజీపీ వైవిధ్యమైనది. అత్యుత్తమమైనది కావడంతో కార్పొరేట్‌ సంస్థలను ఆకర్షించగలుగుతున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement