Sunday, May 5, 2024

Breaking | ఎల్లుండి తెలంగాణ భవన్​లో బీఆర్​ఎస్​ కీలక భేటీ.. పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేయనున్న కేసీఆర్​

ఈనెల 10వ తేదీ (ఎల్లుండి) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన.. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్​ పార్టీ సహా, రాష్ట్ర కార్యవర్గ.. సంయుక్త సమావేశం జరుగనున్నది. ఈ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ, మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ లు, డిసిఎమ్ఎస్, డి సి సి బి చైర్మన్ లు పాల్గొంటారు. ఇది ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు.. పార్టీ కార్యకలాపాలు.. తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ఆహ్వానితులు ప్రతీఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని అధినేత సిఎం కేసిఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement