Thursday, May 2, 2024

Breaking : న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూతో – హ‌ర్బ‌జ‌న్ భేటీ – కాంగ్రెస్ లో చేరిక ఖాయమా !

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూతో హ‌ర్బ‌జ‌న్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో భ‌జ్జీ చేరిక ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. కాగా సిద్దూతో భేటీ అయిన ప‌ది రోజుల‌కు హ‌ర్బ‌జ‌న్ రిటైర్మెంట్ ని ప్ర‌క‌టించాడు. ఈ మేర‌కు భ‌జ్జీని అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నిల‌బెట్టాల‌ని కాంగ్రెస్ భావిస్తుంది. న‌కోదార్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి క‌స‌ర‌త్తు జ‌రుగుతుంది. అంతేకాకుండా ప్రచార‌క‌ర్త‌గా కూడా ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంది. టీం ఇండియా వెట‌ర‌న్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ క్రికెట్ కి శుక్ర‌వారం రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 41ఏళ్ల వ‌య‌సులో హ‌ర్భ‌జ‌న్ త‌న ఆట‌కు రిటైర్మైంట్ ప్ర‌క‌టించ‌డం విశేషం. హర్భజన్ మూడు సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రలు పోషించాడు. ముజ్ సే షాదీ కరోగి (2004), భాజీ ఇన్ ప్రాబ్లమ్ (2013), సెకండ్ హ్యాండ్ హస్బెండ్ (2015) సహా ఫ్రెండ్షిప్ అనే మూవీలో లీడ్ రోల్ పోషించాడు. ఫ్రెండ్షిప్ అనే చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇప్పుడు రాజ‌కీయాల్లోకి అడుగుపెడుతున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement