Monday, April 29, 2024

Breaking: యూకేలో ఒమిక్రాన్ తొలి మ‌ర‌ణం

ఒమిక్రాన్ రోజురోజుకు పెరుగుతోంది. యూకేలో ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తున్న విష‌యం తెలిసిందే.. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయే త‌ప్ప‌… మ‌ర‌ణాలు లేవు. అయితే తాజాగా తొలి మ‌ర‌ణం న‌మోదైంది. ప్రపంచంలోనే తొలి ఓమిక్రాన్ మరణం యూకేలో సంభవించిన‌ట్లు ఆదేశ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ధ్రువీకరించారు. పరిస్థితి ఇలాగే కొన‌సాగితే.. మరికొన్ని నెలల్లో 75 వేలకు పైగా మరణాలు సంభవించే అవకాశముంద‌ని అక్కడి పరిశోధన సంస్థలు హెచ్చిరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పోలీస్తే యూకేలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే ఇప్పటి వరకు 7816 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 63 దేశాలకు కరోనా ఓమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. యూకేలో 3137 ఓమిక్రాన్ కేసులు నమోదు కాగా… డెన్మార్క్ 2471, దక్షిణాఫ్రికాలో 779 కేసులు నమోదయ్యాయి. అయితే ఇన్నాళ్లు ఓమిక్రాన్ కేసుల్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్న తరుణంలో తొలి మరణం సంభ‌వించ‌డంతో ఆందోళ‌న క‌లిగించే విధంగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement