Wednesday, November 6, 2024

Breaking : పోలెరమ్మ జాత‌రలో న్యూడ్ గా డ్యాన్స్ ఈవెంట్ – ప‌ది మంది అరెస్ట్

పేరుకేమో పోలెర‌మ్మ జాత‌ర‌..దైవ కార్యం పేరుతో పాప‌కార్యాల‌కి త‌ల‌పెట్టారు ప‌లువురు వ్య‌క్తులు. పోలెర‌మ్మ జాత‌ర పేరుతో న్యూడ్ డ్యాన్స్ ని నిర్వ‌హించారు ఈవెంట్ వారు. ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పు గోదావ‌రి జిల్లాలోని ఉప్పంగలా గ్రామంలో న్యూడ్ డాన్స్ ఈవెంట్ నిర్వ‌హించారు. కొంత మంది అమ్మాయిల‌తో ఓ ప‌ది మంది వ్య‌క్తులు క‌లిసి న‌గ్నంగా డ్యాన్సులు చేయించారు. దాంతో కొంద‌రు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్క‌డికి చేరుకుని న్యూడ్ డ్యాన్స్ ఈవెంట్ నిర్వ‌హించిన వారితో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement