Sunday, May 5, 2024

Breaking : మాకు రాజ్యాంగ‌మే భ‌గ‌వ‌ద్గీత – క‌ర్నాట‌క హైకోర్టు

హిజాబ్ వివాదంపై క‌ర్నాట‌క హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. చ‌ట్ట‌ప్ర‌కారం రాజ్యాంగ‌బ‌ద్దంగా నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ఈ విష‌యంలో భావోద్వేగాల‌కు తావులేద‌న్నారు. మాకు రాజ్యాంగ‌మే భ‌గ‌వ‌ద్గీత అని క‌ర్నాట‌క హైకోర్టు తెలిపింది. కాలేజీల్లో యూనిఫాం త‌ప్ప‌నిస‌రి చేసింది క‌ర్నాట‌క ప్ర‌భుత్వం. రెండు రోజుల క్రితం హైద‌రాబాద్ లో క‌ర్నాట‌క ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. సోష‌ల్ మీడియాలో దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. దాంతో క‌ర్నాట‌క‌లో హిజాబ్ వివాదం ఉద్రిక్తంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement