Friday, May 10, 2024

Breajing : ఏపీ మంత్రులకి భీమ్లానాయ‌క్ సెగ – థియేట‌ర్ ఓపెనింగ్ ని అడ్డుకున్న ఫ్యాన్స్

గుడివాడ‌లో భాస్క‌ర్ సినిమా థియేట‌ర్ ఓపెనింగ్ కి వెళ్లారు ఏపీ మంత్రులు. కొడాలి నాని, పేర్ని నానిని హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ అడ్డుకున్నారు. థియేట‌ర్ లోకి చొచ్చుకొని వెళ్లేందుకు యత్నించారు ఫ్యాన్స్. కాగా ప‌లువురు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రారంభ చిత్రంగా థియేటర్ లో భీమ్లా నాయక్ మూవీని ప్రదర్శించారు. థియేటర్ వద్ద మంత్రి పేర్ని నానిను అడ్డుకునేందుకు ప్రయత్నించారు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు. జై పవన్ కళ్యాణ్, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని పెద్ద పెట్టున నినాదాలు చేసిన అభిమానులు. గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ , పలువురు అభిమానులను అరెస్ట్ చేశారు పోలీసులు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలను వేధించడం దుర్మార్గమన్నారు అభిమానులు. ఫోటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తమను అరెస్టు చేయడం అన్యాయం అంటున్నారు జనసేన పార్టీ శ్రేణులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement