Tuesday, October 8, 2024

Braking : లోకాయుక్త కార్యాలయం ప్రారంభించిన – జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి

కర్నూలు : హైదరాబాద్ జాతీయ రహదారి పరిధిలోగల సంతోష్ నగర్ లో లోకాయుక్త సంస్థ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.లోకాయుక్త సంస్థ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో రిజిస్ట్రార్ విజయలక్ష్మి, లోకాయుక్త సంస్థ ఐజి నరసింహారెడ్డి, డైరెక్టర్ లీగల్ వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ పోలయ్య, డిప్యూటీ డైరెక్టర్ లీగల్ మురళీ మోహన్ రెడ్డి, లోకాయుక్త సంస్థ డీఎస్పీలు, ఆర్ అండ్ బి ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు, లోకాయుక్త సంస్థ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement