Thursday, April 25, 2024

Brahmos: బ్రహ్మోస్​ మిస్సైల్​ మిస్​ఫైర్​ ఘటన.. ముగ్గురు ఐఏఎఫ్​ ఆఫీసర్ల సస్పెండ్​!

బ్రహ్మోస్ మిస్సైల్ మిస్‌ఫైర్ కేసుకు సంబంధించి ముగ్గురు భారత వైమానిక దళ (ఐఏఎఫ్) అధికారుల సేవలను మంగళవారం రద్దు చేశారు. మంగళవారం ఒక గ్రూప్ కెప్టెన్, ఇద్దరు వింగ్ కమాండర్లు సస్పెన్షన్​కు గురయ్యారు. ఈ ఏడాది మార్చి 9న అనుకోకుండా బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించారు. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించేందుకు ఏర్పాటు చేసిన కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (కల్నల్), ఘటనకు సంబంధించిన బాధ్యతను నిర్ణయించడంతోపాటు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) నుండి మూడు తేడాలున్నట్లు గుర్తించింది. అధికారులు ప్రమాదవశాత్తు క్షిపణిని పేల్చారు. కాగా, ఈ ఘటనకు ముగ్గురు అధికారులను ప్రాథమికంగా బాధ్యులుగా గుర్తించారు. వీరి సేవలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement