Friday, May 3, 2024

గాడ్ ఫాద‌ర్ సెట్ లో బాలీవుడ్ ‘కండ‌ల వీరుడు’ – వెల్ క‌మ్ ప‌లికిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం గాడ్ ఫాద‌ర్. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్నాడు. కాగా నేడు ‘గాడ్ ఫాదర్’ సెట్ లోకి అడుగు పెట్టాడు స‌ల్మాన్ ఖాన్. పొలిటికల్, యాక్షన్ థ్రిల్లర్ అయిన ఈ సినిమా షూటింగ్ లో చిరంజీవికి ఆయన జత కలిశారు. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ సల్మాన్ ఖాన్ అక్కడకు వెళ్లి షూటింగ్ లో చేరిపోయారు. సల్మాన్ ఖాన్ తో కలిసి దిగిన ఫొటోను చిరంజీవి తన ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నారు. ‘‘గాడ్ ఫాదర్ టీంలోకి భాయ్ సల్మాన్ ఖాన్ కు స్వాగతం. మీ రాకతో ప్రతి ఒక్కరిలో ఉత్సాహం రెట్టింపైంది. అందరిలోనూ ఎనర్జీని పెంచింది. సల్మాన్ తో స్క్రీన్ పంచుకోవడం ఆనందంగా ఉంది. సల్మాన్ ఖాన్ నటనతో అభిమానులకు మ్యాజిక్ కిక్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని ఆయన ట్వీట్ చేశారు. మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. చిరు సోదరి పాత్రలో నయనతార కనిపించనుంది. సత్యదేవ్ కూడా నటించనున్నారు ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ దీనిపై కూలో పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement