Wednesday, May 1, 2024

యూట్యూబ్ లో దూసుకుపోతోన్న – మెగాస్టార్ చిరంజీవి న‌టించిన యాడ్

మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ రిలీజ్ అయి యూట్యూబ్ లో వైర‌ల్ అవుతోంది. కాగా ఈ యాడ్ ని ద‌ర్శ‌కుడు సుకుమార్ డైరెక్ట్ చేయ‌డం విశేషం. శుభగృహ’ రియల్ ఎస్టేట్ వారి కోసం ఈ యాడ్ రూపొందించారు. ఇందులో చిరంజీవి, కుష్బు జంటగా నటించారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా అనసూయ భరద్వాజ్ నటించింది. చక్కటి నటనతో చిరంజీవి ఇందులోనూ చించేశారని యాడ్ చూసిన సినీ లవర్స్, మెగా అభిమానులు అంటున్నారు. తన భార్య రేఖ పుట్టిన రోజు సందర్భంగా సర్ ప్రైజ్ చేయాలని చిరు అనుకుంటారు. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ గౌతమ్ ఫోన్ చేశాడని ఇంటి నుంచి హడావిడిగా బయలుదేరుతాడు చిరు. అయితే, ఇంత హడావిడి ఎందుకని రేఖ (ఖుష్బు) అనుమానపడుతుంది. చిరును ఫాలో అవుతుంది. వారు శుభగృహ ఆఫీసుకు వెళ్లగా, ఈ రోజు తన భార్య రేఖ పుట్టిన రోజని, సొంతిల్లు తన కల అని, అది సాకారం ఈ రోజు చేయాలనుకుంటున్నానని చిరు చెప్తాడు. శుభ గృహ వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన ఇంటిపత్రాలను తన భార్య రేఖ బర్త్ డే సందర్భంగా చిరు అందజేస్తాడు. అలా కథ సుఖాంతమవుతుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement