Friday, March 29, 2024

ఖమ్మంలో ‘బ్లాక్ ఫంగస్’ కలకలం

తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. ఇప్ప‌టికే ఉమ్మ‌డి ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలో ప‌లువురికి బ్లాక్ ఫంగ‌స్ సోక‌గా.. తాజాగా ఖమ్మం జిల్లాలో కూడా బ్లాక్ ఫంగస్ కేసు న‌మోదైంది.  మధిర నియోజకవర్గంలోని నేరడ గ్రామానికి చెందిన తాళ్లూరి భద్రయ్యకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయ‌ని ఖ‌మ్మం ప్ర‌భుత్వ హాస్పిట‌ల్ డాక్ట‌ర్లు తెలిపారు. తాళ్లూరి భ‌ద్ర‌య్య ఇటీవ‌లే క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నార‌ని.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ లక్షణాలను గుర్తించామని ఖమ్మం ప్రభుత్వ హాస్పటల్ వైద్యులు తెలిపారు. వైద్యులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

కాగా, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం రేపిన సంగతి తెలిసిందే. బీర్కూర్ మండలం బరం గెడిగిలో ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కరోనా తగ్గాక బ్లాక్ ఫంగస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. వెంటనే చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లోనూ బ్లాక్ పంగస్ ఉగ్రరూపం దాల్చుతోంది. బ్లాక్ పంగస్ కేసులు రోజురోజుకు భయటపడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేంద్రంలో పలువురు బ్లాక్ పంగస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలతో నిర్మల్ జిల్లా భైంసా డివిజన్‌లో ఇద్దరు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ ప్రాంతానికి చెందిన మహిళ మృతి చెందింది. అలాగే పలువురు బాధితులు కంటి చూపు కోల్పోయారు. బ్లాక్ ఫంగస్‌తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బాధితులను చికిత్స కొసం హైదారాబాద్ లోని ప్రైవేట్ అసుపత్రికి తరలించారు. వ్యాధి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement