Sunday, May 19, 2024

బెంగాల్ లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా..!

ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 77  స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం 75కి పడిపోయింది.  బీజేపీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు నిశిత్ ప్రామాణిక్, జగన్నాథ్ సర్కార్ లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు లోక్‌ సభ సభ్యులు కావడంతో ఏదో ఒక పదవిని వదులుకోవాలి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలన్న బీజేపీ అధిష్ఠానం సూచనలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌కు బుధవారం అందజేశారు. దీంతో అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 75కి తగ్గింది.

నిశిత్, జగన్నాథ్ లతో పాటు మరో ముగ్గురు ఎంపీలను బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి బీజేపీ దింపింది. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా కీలక పాత్రను పోషిస్తారనే భావనతో వీరికి టికెట్లు ఇచ్చింది. అయితే, మమతా బెనర్జీ భారీ మెజార్టీ సాధించి మరోసారి అధికారపీఠం ఎక్కారు. ఈ నేపథ్యంలో, అసెంబ్లీలో వీరిద్దరూ ఉండి చేయాల్సిందేమీ లేదని, వీరు పార్లమెంటులో ఉంటే పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందని బీజేపీ హైకమాండ్ భావించింది. దీంతో, వారితో ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయించింది.

మరోవైపు ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 రోజుల్లోనే పదవులకు రాజీనామా చేయడంతో అధికార తృణమూల్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. లోక్‌సభలో తన బలం తగ్గిపోతుందనే భయంతోనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని టీఎంసీ ఎద్దేవా చేసింది. అంతేకాదు, కేంద్ర బలగాలతో బీజేపీ ఎమ్మెల్యేలకు భద్రత కల్పించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించింది.

- Advertisement -

ఇదీ చదవండి: అలర్ట్: తెలియకుండానే ప్రాణం తీసేస్తున్న కరోనా కొత్త లక్షణం

Advertisement

తాజా వార్తలు

Advertisement