Saturday, May 4, 2024

తెలంగాణ‌కు బిజెపి అగ్ర‌నేత‌ల క్యూ…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఇక నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ప్రతీ నెలా ఒక అగ్రనేత తెలంగాణాలో పర్యటించేలా భారతీయ జనతా పార్టీ (భాజపా) అధినాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు- తెలుస్తోంది.ప్రధాని నరేంద్రమోడీ, హోం, సహకార శాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారా మన్‌, పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా తో సహా ముఖ్యనేతలంతా రాష్ట్రంలో తిరిగేలా వ్యూహం రచిస్తోంది.కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసి ఫలితాల ప్రకటన తర్వాత కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు,భాజపా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు తెలంగాణాలో మకాం వేసి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తిరిగి ప్రచారం నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్టు- సమాచారం.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను పూర్తిగా తన భుజ స్కందాలపై వేసుకుంటానని పార్టీ అధికారంలోకి ఎలా రాదో చూస్తానని అమి త్‌ షా ఇటీ-వల తనను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడుతూ వ్యాఖ్యానించినట్టు- సమాచారం.

ప్రధాని పర్యటన తర్వాత అమిత్‌ షా
ఆధునీకరించిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రారంభం, సికింద్రాబాద్‌-తిరుపతి నడుమ ప్రవేశపెడుతున్న వందే భారత్‌ ఎక్సప్రెస్‌ రైలు ఇతర అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,శంఖు స్థాపనలు చేసేందుకు ఈ నెల 8 న ప్రధాని మోడీ తెలంగాణ వస్తున్నారు.సికింద్రాబాద్‌ పెరేడ్‌ మైదానంలో జరిగే బహిరంగసభలో అయన ప్రసంగిస్తారు.అసెంబ్లీ ఎన్నికలు,భవిష్యత్‌ ప్రణాళికలపై ప్రధాని రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.హైదరాబాద్‌ పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్లే ముందు బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర భాజపా పదాది కారులు,ముఖ్య నేతలతో గంటకు పైగా సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు- చేస్తున్నట్టు- సమాచారం.ఈ సమావేశం ఏర్పాటు-కు ప్రధాని కార్యాలయం నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయని చెబుతున్నారు.

మే నెలలో అమిత్‌ షా పర్యటిస్తారని భాజపా రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు పొరుగున ఉన్న రాయచూర్‌, బీదర్‌, గుల్బార్గా, సింధనూర్‌, కొప్పోల్‌ వస్తారని పనిలో పనిగా తెలంగాణలోనూ పర్యటించేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని భాజపా నేతలు చెబుతున్నారు.వచ్చే నెలలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నట్టు- చెబుతున్నారు.ఎన్నికల వేడి మొదలయ్యాక కేంద్రమంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రచారం నిర్వహించే
విధంగా జాతీయ నాయకత్వం కార్యక్రమాలను రూపొందిస్తుందని పార్టీ కీలక నేత ఒకరు చెప్పారు.
జిల్లాకో కేంద్ర మంత్రికి బాధ్యతలు
అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఒక్కో కేంద్ర మంత్రికి ఒక్కో జిల్లా ప్రచార బాధ్యతలను కట్టబెట్టేలా వ్యూహం రచిస్తున్నట్టు- సమాచారం. ముక్యంగా హైదరాబాద్‌ సికింద్రాబాద్‌ జంటనగరాలు జీహెచ్‌ఎం సి ప్రాంతాల్లో అగ్రనేతలను పెద్ద ఎత్తున మోహరించేందుకు సిద్ధమవుతోంది. భాగ్యనగరం లో 13 రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉండడంతో ఆయా రాష్ట్రాల మంత్రులు ముఖ్య నేతలను ఇక్కడికి రప్పించి ఆత్మీయ సమావేశాలను నిర్వహించాలన్న ఆలోచనతో పార్టీ ఉన్నట్టు- సమాచారం. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బంగా, పంజాబ్‌, బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందినవారు ఎప్పుడో ఇక్కడికి వచ్చి స్థిరనివాసం ఏర్పాటు- చేసుకుని ఉంటు-న్నారు. వారిని మచ్చిక చేసుకుని ఓట్లు- కొల్లగొట్టాలన్న పట్టు-దలతో భాజపా జాతీయ నాయకత్వం ఉన్నట్టు- ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement