Sunday, April 28, 2024

షాంపేన్ బాటిల్ ఓపెన్ చేసిన బిజెపి సీనియ‌ర్ నేత‌-ఫొటో పోస్ట్ చేసిన మానిక్కం ఠాగూర్

కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ ఓ ఆసక్తికర ట్వీట్ పోస్ట్ చేశారు. బిజెపి సీనియ‌ర్ నేత ప్రకాష్ జవదేకర్ ఓ పార్టీలో ఉన్న ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో ప్రకాష్ జవదేకర్ షాంపేన్ బాటిల్ ను ఓపెన్ చేస్తూ కనిపిస్తున్నారు. మానిక్కం ఠాగూర్ ఈ ఫోటోను పోస్ట్ చేసి… ‘ ఇతను ఎవరు.. అంటూ సెటైరికల్ గా కామెంట్ చేశారు. ప్రస్తుతం మానిక్కం ఠాగూర్ పోస్ట్ చేసిన ఈ ఫోటో మరెంత రాజకీయ రచ్చకు దారి తీస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement