Wednesday, October 4, 2023

Flash: గడ్చిరోలిలో ఎదురు కాల్పులు.. జవాన్ కు తీవ్ర గాయాలు

ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి ప్రాంతంలో ఉదయం పోలీసులు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.  దాదాపు అరగంట పాటు కొనసాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయనను నాగ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. జవాన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గడ్చిరోలి ఎస్పీ  అంకిత్ తెలిపారు. ధోధరాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్‌కౌంటర్‌ జరగడంతో ఆ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. భట్పర్-ఇర్పానార్ అడవులలో నక్సలైట్లు ఉన్నారని సమాచారం పోలీసులకు తెలియడంతో  ఈ దాడులు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement