Thursday, May 2, 2024

బ‌ర్త్‌డే పార్టీలు, కేక్ క‌టింగ్‌లు.. కేరాఫ్ అడ్రస్‌గా మారిన ట్యాంక్‌బండ్‌ (వీడియో)

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం.. ఎక్క‌డ చూసినా కిక్కిరిపోయిన వాహ‌నాల‌తో క‌నిపించే రోడ్లు.. హార‌న్ల మోత‌, వాహ‌నాల నుంచి వ‌చ్చే పొగ‌తో కాలుష్యం.. ఇదంతా ఒక‌వైపు.. అంద‌మైన లొకేష‌న్లు, ప‌చ్చ‌ని పార్కులు.. బ‌డా బ‌డా బిల్డింగులు మ‌రోవైపు.. ఇంత‌టి బిజీ లైఫ్‌లోనూ దోస్తుగాళ్ల‌తో క‌లిసి ఎంజాయ్ చేయ‌డానికి ఓ ప్లేస్ అంటూ ఉండాలి క‌దా.. అవును ఇప్పుడు మ‌హాన‌గ‌రం న‌డిబొడ్డ‌న ఉన్న హుస్సేన్ సాగ‌ర్, ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్డు వేదిక‌గా మారాయి. రోజంతా క‌ష్ట‌ప‌డి సాయంత్రం కాస్త సేద‌తీరాల‌నుకున్న వారికి అడ్డాగా అవుతున్నాయి.

అంతేకాదు.. పార్టీల‌కు, సెల‌బ్రేష‌న్స్‌కి కూడా హుస్సేన్‌సాగ‌ర్‌, నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్‌ కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతున్నాయి. ఎందుకంటే చాలామంది హుస్సేన్‌సాగ‌ర్, ట్యాంక్‌బండ్ చుట్టుప‌క్క‌ల సంబురాలు చేసుకుంటున్నారు. దీనికి నిద‌ర్శ‌నమే ఈ వీడియో.. అలా కారులో చూస్తూ వెళ్తుంటే దాదాపు 12 మంది త‌మ బ‌ర్త్‌డే సెలబ్రేష‌న్స్‌లో మునిగిపోయారు.. అలా లెక్కేసుకుంటూ పోతే దాదాపు 12 కేక్ క‌టింగ్‌లు క‌నిపించాయి. అంత‌గా కావాలంటే మీరు కూడా ఈ వీడియో చూసి మురిసిపోండి.. స‌ర‌దాగా ఎంజాయ్ చేయాల‌నుకుంటే మీరు మీ దోస్తుల‌తో క‌లిసి వెళ్లండి.. హ్యాపీ బ‌ర్త్‌డేలు చెప్పేసుకోండి..

వీడియో కోసం.. www.prabhanews.com లో చూడొచ్చు..

Advertisement

తాజా వార్తలు

Advertisement