Thursday, April 25, 2024

దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం..

కరోనా మయదారి రోగం నుంచి బయటకు రాకముందే.. ఇప్పుడు మరో వైరస్ తో తొలి మరణం సంభవించింది.. ఢిల్లీ 11 ఏళ్ల బాలుడు బర్డ్ ఫ్లూ తో మరణించాడు..ఈనెల 2 వ తేదీన హ‌ర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యూమోనియా, లుకేమియా ల‌క్ష‌ణాల‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరాడు. బ‌ర్డ్‌ఫ్లూ సాధార‌ణంగా ప‌క్షుల‌కు సోకుతుంది.  అయితే, ప‌క్షుల నుంచి మ‌నుషుల‌కు సోక‌డం ఇండియాలో ఇదే మొద‌టిసారి.  మొద‌ట బాలుడికి క‌రోనా టెస్టులు నిర్వ‌హించ‌గా నెగెటివ్ గా రావ‌డంతో శాంపిల్స్‌ను పూణేలోని వైరాల‌జీ ల్యాబ్‌కు పంప‌గా బ‌ర్డ్‌ఫ్లూ వైర‌స్ సోకిన‌ట్టు నిర్ధార‌ణ జ‌రిగింది.  బ‌ర్డ్‌ఫ్లూతో చికిత్స పొందుతూ మ‌ర‌ణించ‌డంతో బాలుడి కాంటాక్ట్‌ను ట్రేస్ చేసే ప‌నిలో ఉన్నారు అధికారులు.  నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ సంస్థ హర్యానాకు బృందాన్ని పంపింది.  ఆసుప‌త్రిలో చేరే ముందు బాలుడి కాంటాక్ట్‌ను గుర్తించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. .  బాలుడికి చికిత్స అందించిన వైద్యులు ఐసోలేష‌న్‌కు వెళ్లాల‌ని, ఏవైనా ల‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే రిపోర్ట్ చేయాల‌ని నిపుణులు సూచించారు.     ఈ ఏడాదిలో అనేక రాష్ట్రాల్లో బ‌ర్డ్ ఫ్లూ విజృంభించడంతో వేలాది కోళ్లు, ప‌క్షులు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement