Friday, April 19, 2024

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

పుత్తడి ధరలకు మళ్లి రెక్కలొచ్చాయి..మొన్నటి వరకు స్థిరంగా ఉన్న ధరలు మళ్లి పెరుగుతున్నాయి…తాజాగా ఈరోజు కూడా బంగారం ధ‌ర‌లు పెరిగాయి.  పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.250 పెరిగి రూ.45,250కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.280 పెరిగి రూ.49,370కి చేరింది.  బంగారం ధ‌ర‌లు పైపైకి క‌దిలితే, వెండి ధ‌ర‌లు మాత్రం భారీగా ప‌త‌నం అవుతున్నాయి.  కిలో వెండి ధ‌ర రూ.600 వ‌ర‌కు తగ్గి రూ. 72,300కి చేరింది.  మార్కెట్లు పుంజుకోవ‌డంతో ధ‌ర‌లు పెరిగిన‌ట్టు నిపుణులు చెబుతున్నారు. దీంతో కొనుగోలుదారులు బంగారన్ని కొనాలంటే తబడుతున్నారు.. అయితే అషాడం మాసం కావడంతో ఇప్పుడు బంగారానికి డిమాండ్ గట్టిగానే ఉంటుందని..దాంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : జెఫ్‌ బెజోస్‌ అంతరిక్ష ప్రయాణం సక్సెస్..

Advertisement

తాజా వార్తలు

Advertisement