Thursday, April 25, 2024

Bigg Boss Twist: ఇంటి నుంచి బయటికొచ్చిన జెస్సీ!

బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పుడు ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతం ఇంట్లో 10 మంది హౌస్ మేట్స్ మాత్రేమే ఉన్నారు. అయితే, అనుహ్యంగా జెస్సీ ఇంటి నుంచి బయటకి వచ్చాడు. గ‌త కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌జస్వంత్‌ని కన్ఫెషన్ రూంకి పిలిచిన బిగ్ బాస్.. ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఇప్పుడు ఎలా ఉందని అడగ్గా.. పర్లేదు బాగానే ఉంది కానీ.. పడుకుంటే భూమి గుండ్రంగా తిరిగినట్టుగా అనిపిస్తుందని చెప్పాడు. దీంతో బిగ్ బాస్.. మీకు మెడికల్ ఇన్వెస్టిగేషన్ చాలా అవసరం.. అందుకోసం మీరు ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. అంద‌రికి బై చెప్పి మెయిన్ గేట్ నుండి బ‌య‌ట‌కు రావాల‌ని చెప్పాడు.

క‌న్ఫెష‌న్ రూం నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌స్వంత్.. నా ఆరోగ్యం బాగోలేక నేను బ‌య‌ట‌కు వెళుతున్నాను అని చెప్పాడు. దీంతో సిరి, షణ్ముఖ్ ఎడ్చారు. అయితే ఇంటి నుంచి వెళ్తు జెస్సీ వెళ్తూ కూడా చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. ‘నా హెల్త్ బాలేనందుకు చాలామంది పేంపరింగ్ చేశారు. మానస్, సన్నీ, కాజల్, పింకీ, ఆనీ అందరూ. షణ్ముఖ్, సిరి పేర్లను చెప్పాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మీరు నా హార్ట్‌కి దగ్గరైన వాళ్లు’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

అంద‌రికి బై చెప్పి వెళ్లగా.. బిగ్ బాస్‌  ట్విస్ట్ ఇచ్చాడు. జ‌స్వంత్‌ని తీసుకెళ్లి సీక్రెట్ రూంలో ఉంచారు. సీక్రెట్ రూంలోకి వచ్చిన జెస్సీ.. ‘నాకు మంచి హెల్త్ చెకప్ చేయించారు. నాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. హెల్త్ కండిషన్ ఒకే.. నేను ఇంకా గేమ్‌లోనే ఉన్నాను. సీక్రెట్ రూంలో పెట్టినందుకు చాలా థాంక్స్ బిగ్ బాస్’ అని చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement