Wednesday, March 27, 2024

బిగ్ బాస్7.. కంటెస్టెంట్ గా తార‌క‌ర‌త్న‌..!

బిగ్ బాస్7 ఈసారి కాస్త ముందుగా ప్ర‌సారం కానుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మాములుగా అయితే ప్రతి ఏటా సెప్టెంబర్‌లో సీజన్ ప్రారంభమవుతుంది. తాజాగా ఈసారి ఓటీటీ సీజన్ లేనందున.. 2023 జూలై నెలలో బిగ్ బాస్ తెలుగు 7 ప్రీమియర్ అవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇన్ని ఉత్కంఠల మధ్య అక్కినేని నాగార్జున ఈ షోలో కనిపించడం లేదంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఆ విషయం నిజమేనట. కిక్కిచ్చే న్యూస్ ఏంటంటే.. దగ్గుబాటి రానా ఈసారి సీజన్ హోస్ట్ చేయనున్నారట. అంతేకాదు ఇప్పటివరకు జరిగిన సీజన్లలో అత్యంత ప్రజాదరణ పొందిన పాత కంటెస్టెంట్లు బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్‌లో భాగంగా కానున్నారట. కాగా నందమూరి హీరో తారక రత్న ఓ కంటెస్టెంట్‌గా రానున్నారట. సినిమాల్లో పెద్దగా సత్తా చాటలేకపోతున్న ఈయన.. ఇటీవల పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యారు. ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నంలో.. ఈ సారి బిగ్ బాస్ సీజన్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement