Friday, April 26, 2024

బిగ్ బాస్ 5: ఆ అయిదుగురు సేఫ్

బిగ్ బాస్ 5 ఆసక్తికరంగా సాగుతోంది. బిగ్ బాస్ 5 తెలుగు పదో వారాలు పూర్తి చేసుకుంది. నిన్నటితో పది మంది ఎలిమినేట్ అయ్యారు. 19 మందితో మొదలైన బిగ్ బాస్.. ఇప్పుడు హౌస్ లో తొమ్మిది మంది మిగిలారు.

పదో వారంలో జెస్సీ ఎలిమినేట్ అయ్యాడు. నామినేషన్స్ లో అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నదానిపై ముందు నుంచి ఉత్కంఠ నెలకొంది. అయితే ఎక్కువ మంది కాజల్ ఎలిమినేట్ అవుతారంటూ ప్రచారం జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేషన్ జరిగింది.

ఎలిమినేషన్స్ లో ఐదుగురు ఉండగా చివరికి మానస్-కాజల్ మాత్రం మిగిలారు. అయితే ఇక్కడే హోస్ట్ నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. ఎవరూ ఎలిమినేట్ కావడం లేదని చెప్పారు. అనారోగ్య సమస్యలతో జెస్సీ ఇంటి నుంచి బయటకు వస్తున్నట్టు తెలిపాడు. దీంతో ఎలిమినేషన్ లో ఉన్న అందరూ సేఫ్ అయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement