Tuesday, May 7, 2024

‘స‌న్నీ’యే విన్న‌ర్ : నిజ‌మెంతో తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే

తెలుగు బిగ్ బాస్5 ముగింపుద‌శ‌కి చేరుకుంది. రేప‌టితో ఈ రియాల్టీ షో ముగియ‌నుంది. మ‌రి ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రో తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే. మరోవైపు ఈ సీజన్ విన్నర్ ఎవరుకావచ్చనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. వీజే సన్నీ, శ్రీరామచంద్ర, షన్ముఖ్ జశ్వంత్, మానస్, సిరిలు ఫైనల్స్ వరకు వచ్చారు. వీరందరూ ప్రేక్షకులను అలరించడానికి తమ వంతుగా బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక ప్రేక్షకులు వేసే ఓట్లతో వీరిలో ఒకరు విన్నర్ గా నిలవనున్నారు. మరోవైపు ఈ సీజన్ విన్నర్ ఎవరనే దానిపై ఒక వార్త వైరల్ అవుతోంది. ఇది ఎంత వరకు నిజమో కానీ… ఈ సీజన్ విన్నర్ సన్నీ అనేది ఆ వార్త సారాంశం. ఓటింగ్ లో 34 శాతం ఓట్లతో సన్నీ తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో షన్ముఖ్ (31), శ్రీరామచంద్ర (20), మానస్ (8), సిరి (7) ఉన్నారు. అయితే ఈ ఓటింగ్ ఫలితాలు నిజమా కాదా తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement