Thursday, May 2, 2024

ప్రధాని మోడీకి నగదాగ్‌ పెల్‌గి ఖొర్లో.. భూటాన్‌ అత్యున్నత పురస్కారం

న్యూఢిల్లి : పొరుగుదేశాలతో బలమైన మైత్రీ సంబంధాల కోసం ప్రత్యేక కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. పొరుగుదేశమైన భూటాన్‌ తమ దేశ అత్యున్నత పురస్కారమైన నగదాగ్‌ పెల్‌గి ఖొర్లోతో భారత్‌ ప్రధాని మోడీని గౌరవించనుంది. ఈ మేరకు అత్యున్నత పౌర పురస్కారానికి ప్రధాని మోడీని ఎంపిక చేసినట్టు భూటాన్‌ ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. భూటాన్‌ జాతీయ దినోత్సవమైన శుక్రవారం ఈ పౌర పురస్కారానికి ప్రధాని మోడీని ఎంపిక చేసినట్టు ఆ దేశ ప్రధాని లోటే షీరింగ్‌ శుక్రవారం సోషల్‌ మీడియాలో ప్రకటించారు.

తమ దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ప్రధాని మోడీ ఎంపిక కావడం పట్ల సంతోషిస్తున్నట్టు తెలిపారు. చాలా ఏళ్లుగా.. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ప్రధాని మోడీ తమ దేశానికి అందించిన సాయాన్ని మర్చిపోలేమని భూటాన్‌ ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. భూటాన్‌ ప్రజల తరఫున ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేస్తున్నట్టు వివరించింది. భారత్‌ ప్రధాని మోడీ ఆధ్యాత్మిక చింతన కలిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడింది. భూటన్‌ అత్యున్నత పురస్కారానికి ప్రధాని మోడీ ఎంపికైన సందర్భంగా పలు దేశాల అధినేతలు, స్థానిక నేతలు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement