Monday, April 29, 2024

బెస్ట్ టూరిజం విలేజ్‌గా భూదాన్ పోచంప‌ల్లి.. అవార్డు అందించిన వ‌ర‌ల్డ్ టూరిజం ఆర్గ‌నైజేష‌న్‌..

‘ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ’ (UNWTO) తొలిసారిగా నిర్వహించిన ‘ఉత్తమ పర్యాటక గ్రామం’ (బెస్ట్ టూరిజం విలేజ్) ప్రతిష్టాత్మక పోటీలో రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా ‘భూదాన్ పోచంపల్లి’ గ్రామం ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల నుంచి 170 ప్రతిపాదనలు రాగా, మన దేశం నుంచి సిఫార్సు చేసిన‌ మూడు గ్రామాల నుంచి భూదాన్ పోచంపల్లి గ్రామం ‘ఉత్తమ పర్యాటక గ్రామం’గా ఎంపికై అరుదైన ఘనతను సాధించింది.

ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో సోమవారం పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, టూరిజం శాఖ ఎండీ బి.మనోహర్ రావు సీఎం కేసీఆర్ ను కలిశారు. ఇందుకు సంబంధించి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంస్థ జారీచేసిన గుర్తింపు పత్రాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా వారు అందుకున్నారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను శాలువాతో సీఎం సత్కరించారు. టూరిజం శాఖ అధికారులు చేసిన కృషిని సీఎం కేసీఆర్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement