Wednesday, May 1, 2024

భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్ పై – రామ్ చ‌ర‌ణ్ స్పంద‌న‌

భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్ ఎల‌క్ట్రిఫ‌యింగ్ అని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ట్వీట్ చేశాడు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి డైలాగులు, యాక్షన్ పవర్ ఫుల్ అని కితాబునిచ్చాడు. రానా దగ్గుబాటి పర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. సాగర్ కే చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. థమన్ సంగీతాన్ని అందించారు. సినిమాపై అంచనాలను ఈ ట్రైలర్ అమాంతం పెంచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement