Monday, April 29, 2024

ఓటీటీలో రానున్న ‘భీమ్లానాయక్’…రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాల కాంబినేషన్ లో వచ్చిన భీమ్లా నాయక్ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్దమైంది. ఈ నెల 25వ తేదీన ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. అదే రోజున డిస్నీ హాట్‌స్టార్‌లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్ భారీ మొత్తంలో దక్కించుకున్నాయి.

మలయాళ బ్లాక్‌ బస్టర్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన భీమ్లానాయక్ సినిమాను యంగ్ దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రిప్ట్, మాటలు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement