Tuesday, October 8, 2024

Bheemla Nayak: సంక్రాంతి బరిలో ‘భీమ్లా నాయక్’?

వకీల్ సాబ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’కు రీమేక్ గా తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. రానా ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తొలుత ఈ సినిమాని జనవరి 12న విడుదల చేయాలని భావించారు. సంకాంత్రి రేసులో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి పాన్ ఇండియా చిత్రాలు ఉండడంతో ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ ను ఫిబ్రవరి 25కి వాయిదా వేశారు. దీంతో ఈ సినిమా సంక్రాంతి బరినుంచి తప్పుకుంది.

అయితే జనవరి 7న రిలీజ్ కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీని వాయిదా వేస్తున్నట్లు ఆ చిత్రబృందం శనివారం ప్రకటించింది. ఒమిక్రాన్ వ్యాప్తి, పలు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్ల మూతపడటం, 50 శాతం ఆక్యూపెన్సీ కారణంగా ‘RRR’ సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ క్రమంలో ‘భీమ్లా నాయక్’ మళ్లీ సంక్రాంతి రేసులో నిలిచే అవకాశం ఉందని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. నిత్యామేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్స్ గా నటించారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటల రచయితగా పనిచేస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ముందుగా అనున్నట్లే ‘భీమ్లా నాయక్’ సంకాంత్రికి వస్తాడా? లేదా? అన్నది చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement