Thursday, April 25, 2024

భ‌ళా తంద‌నాన టీజ‌ర్ – డైలాగ్ ల‌తో అద‌ర‌గొడుతోన్న శ్రీ విష్ణు

హీరో శ్రీవిష్ణు నెమ్మ‌దిగా టాలీవుడ్ లో త‌న స‌త్తాని చాటేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. విభిన్న క‌థాంశాల‌ను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఆయ‌న తాజాగా న‌టిస్తోన్న చిత్రం భ‌ళా తంద‌నాన. చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ నుండి టీజ‌ర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కేథ‌రిన్ హీరోయిన్ గా న‌టించింది. నిజాయతీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మ్యాన్ కి కూడా రిస్కే’, ‘లంచం లేనిదే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు’ అంటూ సాగే డైలాగ్ లు ప్రతి ఒక్కరినీ, సొసైటీని తాకేలా ఉన్నాయి. టీజర్ చివరిలో శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ ఇక సూపర్ అనే చెప్పాలి. ‘‘సీఎం కుర్చీలో కూర్చున్న ఎవ్వరైనా ఒక్క సంతకంతో స్టేట్ ఫ్యూచర్ నే మార్చేయొచ్చు. అంటే.. ఆ పవర్ చేతిదా? కుర్చీదా?’’ అనే ఆ డైలాగ్ హైలైట్ అయింది.ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ టీజర్ లో ఆయన ఇచ్చిన బీజీఎం ఓ లెవెల్ లో ఉంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement