Monday, May 20, 2024

తెలంగాణలో సూర్యుడి ప్రకోపం – బీర్లపై మందు బాబుల ప్రతాపం

హైదరాబాద్ – తెలంగాణ లో ఎండలు మండిపోతున్నాయి. మామూలు జనం కొబ్బరిబొండాలు, చెరకు రసాలు, పళ్లరసాలు తాగి చల్లబడుతుంటే.. మద్యం ప్రియులు మాత్రం చల్లని బీర్లతో చిల్ అవుతున్నారు. దీంతో రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో బీర్ల అమ్మకాలు పెరిగాయి. . మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో బీర్ల కోసం జనాలు ఎగబడుతున్నారు. ఏప్రిల్‌లో 17 రోజుల్లోనే నగరవాసులు దాదాపు 1.01 కోట్ల బీర్లు తాగేశారు. ఆబ్కారీ శాఖ లెక్కల ప్రకారం గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో(హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి) కలిపి మొత్తం 8,46,175 కేస్‌ల (ఒక కేస్‌లో 12 బీర్లు ఉంటాయి) బీర్లు అమ్ముడుపోయాయి

ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలో సగటున 10 శాతం చొప్పున విక్రయాలు పెరిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రికార్డుస్థాయిలో విక్రయాలు నమోదవుతున్నాయి. నెలకు సగటున లక్ష చొప్పున బీరు కేసుల విక్రయాలు అధికంగా నమోదవ్వడం గమనార్హం. సాధారణంగా విస్కీ, బ్రాంది తదితర అలవాటున్న వ్యక్తులు సైతం ఎండల ప్రతాపంతో బీరు వైపు చూస్తున్నారు. ఆబ్కారీ శాఖ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌లో గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో రోజూ సగటున 6 లక్షల బీర్లు అమ్ముడవుతున్నాయి. ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో మే నెలలో బీర్ల అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. బీర్ల ఉత్పత్తిని లిక్కర్ కంపెనీలు పెంచుతున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement