Friday, May 3, 2024

ఎలుగుబంట‌యినా..పెద్ద పులి అయినా డోంట్ కేర్ అంటోన్న పెద్దాయ‌న..

పులి పేరు ఎత్తితేనే హ‌డ‌లిపోతాం..అటువంటిది పులిని ఎదురుగా చూస్తే ఇంకేమ‌యినా ఉందా..గుండె ఆగిపోదూ..ఎంత పెద్ద వీరుడ‌యినా స‌రే ఉలిక్కి ప‌డాల్సిందే. అయితే ఓ పెద్దాయ‌న మాత్రం పులికి ఎదురెళ్ళి మ‌రీ పోరాడుతున్నాడు..ఎందుకు అనుకుంటున్నారా..వివ‌రాల్లోకి వెళ్తే..66ఏళ్ళ ఎల్ముల శంక‌ర్..జీవ‌నోపాధి గొర్రెలే..ఈయ‌న‌ది మంచిర్యాల జిల్లా వేమ‌న‌ప‌ల్లి మండ‌లం ఒడ్డుగూడెం..వాళ్ల తాతముత్తాతలు గొర్రెలు కాసేవారు. ఇప్పుడు శంకర్​ కూడా అదే పని చేస్తున్నాడు. ఊరి చివర అడవిలో గొర్రెలు, మేకలు, ఆవులు కాసుకుంట… కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు..

రోజులాగే గొర్రెల మందని తోలుకుని అడవికి వెళ్ళాడు ఈ పెద్దాయ‌న‌​. తోటి కాపర్లతో కలిసి గొర్రెలు కాస్తుంటే.. ఎలుగుబంటి కదలికలు కనపడ్డయ్​. క్షణాల్లోనే ఎలుగుబంటి​ ఎదురుగ వచ్చి నిలబడింది. అయినా భయపడలేదు​. దాన్ని పరిగెత్తించి ప్రాణాలు కాపాడుకున్నాడు శంక‌ర్. ఆ తర్వాత కొద్దిరోజులకే పెద్దపులి శంకర్​ మేకలపై దాడి చేసింది. అది చూసి ప్రాణ భయంతో మిగతా కాపర్లంతా పరుగులు తీశారు. కానీ, శంకర్​ మాత్రం ధైర్యంగా పెద్దపులిని ఎదిరించి … దాని నోట్లోంచి తన మేకని లాగిమ‌రీ బ‌య‌టికి తీసుకువ‌చ్చాడు. దాన్నుంచి తేరుకునేలోపే మరో పులి తన ఆవు మీద దాడి చేసింది. దాన్ని కాపాడటానికి పోతే శంకర్​పై విరుచుకుపడింది ఆ పులి. అయినా భయపడకుండా దాన్ని తరిమి కొట్టాడు. అలా ఇప్పటికే మూడు సార్లు పులితో పోరాడి గెలిచాడు​.

మ‌రి పులిని చూస్తే భ‌యం వేయ‌దా అంటే గొర్రెలు,మేక‌ల వ‌ల్లే కుటుంబ‌పోష‌ణ గ‌డుస్తోంద‌ని వాటి వ‌ల్ల వ‌చ్చే డ‌బ్బుతోనే పిల్ల‌ల చ‌దువుల ద‌గ్గ‌ర నుంచి పెళ్ళిళ వ‌ర‌కు ఆదుకుంటున్నాయ‌ని చెప్పాడు..మూగ‌జీవాల‌యినా ఇంట్లో మ‌నుషుల‌తో స‌మాన‌మ‌ని చెబుతుంటాడు శంక‌ర్ .. అందుకే వాటి ప్రాణాలకి నా ప్రాణం అడ్డుపెడతా. పెద్దపులితోనూ పోరాడతా. ఈరోజుకి మేకలకు కడుపునిండ మేపడం తప్ప ఏదైనా జంతువు చంపుద్దన్న భయం లేద‌ని ఎంతో ధైర్యంగా చెబుతున్న ఈయ‌న ధైర్యానికి హ్యాడ్సాఫ్ చెప్పాల్సిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement