Monday, May 6, 2024

BCCI : వెస్టిండీస్ టూర్ కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

జూలై 12 నుంచి మొదలయ్యే వెస్టిండీస్ టూర్‌కి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఫెయిల్ అయిన టీమిండియా ‘నయా వాల్’ ఛతేశ్వర్ పూజారాకి షాక్ ఇచ్చిన సెలక్టర్లు, అతని ప్లేస్‌లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యంగ్ ప్లేయర్లకు చోటు కల్పించారు. వెస్టిండీస్ టూర్‌లో రోహిత్ శర్మకు రెస్ట్ ఇస్తారని ప్రచారం జరిగినా.. నెల రోజుల బ్రేక్ రావడంతో హిట్ మ్యాన్‌ తిరిగి టీమ్‌తో కలవబోతున్నాడు. విండీస్ టూర్‌లో టెస్టు, వన్డేలకు రోహిత్ శర్మే కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.

విరాట్ కోహ్లీని కొనసాగించిన సెలక్టర్లు, అజింకా రహానేకి తిరిగి టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ అప్పగించారు. 2021 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత టెస్టు వైస్ కెప్టెన్సీ కోల్పోయిన అజింకా రహానే, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రాణించి, 17 నెలల తర్వాత టెస్టుల్లో ఘనమైన రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. టెస్టుల్లో అవకాశం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కి మరోసారి మొండిచేయి చూపించారు సెలక్టర్లు. రంజీల్లో రికార్డు లెవెల్ పర్ఫామెన్స్ ఇస్తున్నా, సెలెక్టర్ల దృష్టిలో మాత్రం పడలేకపోతున్నాడు సర్ఫరాజ్ ఖాన్.

- Advertisement -

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కి జట్టు ఇది: రోహిత్ శర్మ (కెప్టెన్), అజింకా రహానే (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, కెఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జయ్‌దేవ్ ఉనద్కట్, నవ్‌దీప్ సైనీ.

వెస్టిండీస్ టూర్‌లో వన్డే సిరీస్‌కి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, జయ్‌దేవ్ ఉనద్కట్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్.

Advertisement

తాజా వార్తలు

Advertisement