Sunday, May 16, 2021

బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. వరుసగా బ్యాంకులకు సెలవులు

బ్యాంకు ఖతాదారులకు ముఖ్య గమనిక. ఏదైనా పనిమీద బ్యాంకుకు వెళ్లాలి అనుకుంటున్నారా ? అయితే, మే నెలలో బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకొని వెళ్ళండి. ఈ నెలలో మీకు బ్యాంకులకు వెళ్ళాల్సిన పనులు ఏవైనా ఉంటే ఇప్పుడే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ నెలలో బ్యాంకులకు దాదాపు 12 రోజులు సెలవులు ఉన్నాయి.

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు.  వివిధ బ్రాంచుల్లో ఉద్యోగులకు వైరస్ సోకడంతో ముందు జాగ్రత్త చర్యలుగా పలు చోట్ల మధ్యాహ్నం వరకే బ్యాంకులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరుస్తున్నారు. కొన్ని చోట్ల సగం మంది సిబ్బందితోనే సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో బ్యాంకులకు సెలవులు కూడా ఎప్పుడు ఉంటాయన్న విషయం తెలుసుకుంటే ఖాతాదారులు సులభంగా లావాదేవీలు నిర్వహించుకోవడానికి వీలు ఉంటుంది. రిజర్వ్ బ్యాంకు క్యాలెండర్ ప్రకారం ఈ మే నెలలో బ్యాంకులకు మొత్తం 12 సెలవులు ఉన్నాయి.

ఈ నెలలో అత్యధింకగా 5 ఆదివారాలు వచ్చాయి. ఒక రెండో శనివారం, ఒక నాలుగో శనివారం కూడా వచ్చాయి. దీంతో ఆయా రోజుల్లో బ్యాంకులు పని చేయవు. మేడేతో పాటు రంజాన్ కూడా ఇదే నెలలో ఉన్నాయి. వీటితో పాటు జుమత్ ఉల్ విదా, భగవాన్ శ్రీ పరశురామ్ జయంతితో పాటు బుద్ధ పూర్ణిమ కూడా ఈ నెలలోనే ఉన్నాయి. మే 1న మేడే సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ నెల 2, 9, 16, 23, 30 తేదీల్లో ఆదివారాలు వచ్చాయి. ఆయా రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే 8, మే 22 తేదీల్లో రెండో శనివారం, నాలుగో శనివారం ఉన్నాయి. మే 7, 13 తేదీల్లో జుమత్ ఉల్ విదా, రంజాన్ ఉన్నాయి. మే 14న భగవాన్ శ్రీ పరశురామ్ జయంతి/అక్షయ తృతియ, మే 26న బుద్ధ పూర్ణియ రోజు కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది.  

Advertisement

తాజా వార్తలు

Prabha News