Saturday, February 24, 2024

మీ వెనక మేం ఉన్నాం..చంద్ర‌బాబుకి బండ్ల గ‌ణేశ్ భ‌రోసా..

టిడిపి అధ్య‌క్షుడు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో కంటతడి పెట్టారు. మాట్లాడుతుండ‌గానే ఒక్కసారిగా ఏడ్చేశారు . దీంతో.. అక్కడి రిపోర్టర్ ల తో పాటు టిడిపి నాయకులు కూడా షాక్ కు గురయ్యారు. అయితే చంద్రబాబు మీడియా ముందు ఏడవడం పై టాలీవుడ్ స్టార్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సంచలన ట్వీట్ చేశారు. ఆయన ఏడ్చిన వీడియోను షేర్ చేస్తూ కామెంట్ చేశారు బండ్లగణేష్. ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ఏడ్చారని తెలిపారు. ఏపీ పరిస్థితులతో చంద్రబాబునాయుడు టెన్షన్ కు గురయ్యారన్నారు.. మీరు ఏడవద్దని.. మీ వెనక అందరూ ఉన్నారని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు బండ్లగణేష్. బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కు మద్దతు తెలుపుతున్నారు నెటిజన్లు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement