Thursday, April 25, 2024

కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్.. బీజేపీ పోరాటం ఆగదు

రైతాంగం వాన కాలంలో పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన చేసే పోరాటం ఆగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు నివాసంలో ఆయనతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. మాపై జరిగే దాడుల గురించి పోలీసులకు తెలియదా ? అని ప్రశ్నించారు. కోడిగుడ్లు, రాళ్లు పడతాయని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదనీ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే ఎలా ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల తంతులో అన్నింటీకీ కేంద్రం డబ్బులు చెల్లిస్తుందన్నరు. 2022 వరకు రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీలను బీజేపీ ప్రభత్వం నిలబెట్టుకుంటుదని చెప్పారు.

పథకం ప్రకారం రైతులను సతాయించి ఇబ్బందులు పెట్టి కొనుగోలు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం చూస్తోందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ, ఫసల్ భీమా యోజనను కేసీఆర్ ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.కేసీఆర్ సన్న ధాన్యం వద్దని ఫామ్ హౌస్ లో దొడ్డు ధాన్యం వేసుకున్నారనీ దుయ్యబట్టారు. కాళ్ళు మొక్కిన కలెక్టర్ ను ఎమ్మెల్సీ చేస్తున్న ముఖ్యమంత్రికి రైతుల గోడు పట్టదా ? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రశ్నించకుంటే ఇప్పటికైనా కొనుగోళ్లు ప్రారంభం కాకపోయేవన్నారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన సందర్భంలో తమ ఎనిమిది వాహనాలు ధ్వంసమైన పోలీసులు ప్రేక్షక పాత్ర వహిoచడం సరికాదన్నారు. పోలీసుల బందోబస్తు, వారి సహకారంతోనే దాడులు చేస్తున్నారనీ బండి ఆరోపించారు. మాపై దాడికి స్కెచ్ వేసినప్పుడే  కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్అయ్యిందన్నారు. అవినీతి చిట్టా తీసి తప్పకుండా కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామనీ బండి సంజయ్ హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement