Saturday, May 4, 2024

ఢిల్లీలో బాణసంచాపై నిషేధం కొనసాగింపు

ఢిల్లీలో బాణసంచాపై ఆప్‌ ప్రభుత్వం నిషేధాన్ని కొనసాగించనుంది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు బ్యాన్‌ అమలులో ఉంటుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ ఈరోజు ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా తయారీ, అమ్మకం, వినియోగంపై నిషేధం అమలులో ఉంటుందని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఆన్‌లైన్‌ బాణాసంచా విక్రయాలకు సైతం నిషేధం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. చలికాలం వచ్చిందంటే చాలు దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగుతున్న విషయం తెలిసిందే. చలి కారణంగా పొగమంచు, వాహనాల నుంచి వచ్చే పొగకు తోడు పలు రాష్ట్రాల్లో వ్యవసాయ పొలాల్లో వ్యర్థాలను దహనం చేస్తుండడంతో ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement