Friday, May 17, 2024

క్రేజీ ఆల్బ‌మ్ సాంగ్ లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా

ఏడు సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌రో క్రేజీ ఆల్బ‌మ్ తో అల‌రిస్తోంది హీరోయిన్ త‌మ‌న్నా..తబహీ (Tabahi) సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. సింగర్ బాద్షా తో కలిసి నటించింది. ఈ సాంగ్ కు హితేన్ ట్రెండీ మ్యూజిక్ ను అందించారు. ‘రెట్రో పాండ’ ఆల్బమ్స్ నుంచి పార్ట్-1గా ‘తబహీ’ మ్యూజిక్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. వీడియో సాంగ్ లో తమన్నా మరింత గ్లామర్ స్టెప్పులు వేసింది. విజువల్స్ , డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. గతేడాది బాద్షాతో కలిసి టాప్ టక్కర్ మ్యూజిక్ వీడియో సాంగ్ లో రష్మిక మంద‌న్న నటించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ‘జెండా పూల్’ (లో ఆడిపాడారు. తమన్నా తెలుగులోనూ స్పెషల్ సాంగ్స్ చేసేందుకు ప్రయారిటీ ఇస్తోంది. అల్లుడు శ్రీను మూవీతో తొలిసారిగా ఐటెం సాంగ్ లో నటించారు తమన్నా.. ఆ తర్వాత స్పీడున్నోడు, జాగ్వార్, జై లవ కుశ, సరిలేరు నీకెవ్వరు మూవీల్లో స్పెషల్ అపియరెన్స్ తో అలరించింది. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ‘గని’ మూవీలోనూ కొడితే స్పెషల్ సాంగ్ లో నటించింది తమన్నా.. మరోవైపు హిందీలోనూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. డైరెక్టర్ మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బబ్లీ బౌన్సర్’ మూవీలో లేడీ బౌన్సర్ గా కనిపించబోతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement