Friday, May 3, 2024

Heavy Rains: భద్రీనాథ్​ హైవే క్లోజ్​, భారీ వర్షాలతో ఆటంకాలు.. చార్​ధామ్​ యాత్రకు బ్రేక్

రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలతో చార్​ధామ్​ యాత్రకు బ్రేక్​ పడుతోంది. ఉత్తరాఖండ్​లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో మంచు చరియలు విరిగిపడుతున్నాయి. అంతేకాకుండా రోడ్లమీద కొండచరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో యాత్రకు వచ్చే వారు జాగ్రత్తగా ఉండాలని, వర్షాలు తగ్గేదాకా యాత్రను ప్రారంభించొద్దని అధికారులు కోరుతున్నారు.

భారీ వర్షాల కారణంగా బద్రీనాథ్ హైవేపై రెండు రోజులుగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో ఈ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అంతేకాకుండా రుద్రప్రయాగ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోని సిరోబగడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి యాత్రికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పిడబ్ల్యుడి డిపార్ట్ మెంట్ సిరోబగడ్ రోడ్డులోని చెత్త, రోడ్డుపై విరిగిపడ్డ మంచుపెళ్లలను తొలగించడానికి జేసీబీలతో పనులు చేపట్టారు.

రుద్రప్రయాగ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కేదార్‌నాథ్ యాత్రపై ప్రభావం చూపింది. వర్షంతోపాటు కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించే యాత్రికుల సంఖ్య రోజుకు పది వేల నుండి మూడు, నాలుగు వేలకు తగ్గిపోయింది.  గురువారం ఉదయం 10 గంటలకు వర్షం కారణంగా కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్లే ప్రయాణం నిలిచిపోగా ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం యాత్రికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. వాతావరణం అనుకూలించిన తర్వాత యాత్ర పునఃప్రారంభించబడుతుందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement