Friday, April 26, 2024

Breaking: బ్యాడ్ వెద‌ర్‌.. రోడ్డు మార్గాన ఏటూరునాగారం వెళ్తున్న సీఎం కేసీఆర్‌

గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇవ్వాల (ఆదివారం) సీఎం కేసీఆర్‌ పర్యటిస్తున్నారు. భారీ వ‌ర్షాల‌తో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో ప‌రిశీలించేందుకు నిన్న బ‌య‌లుదేరిన సీఎం, హ‌నుమ‌కొండ‌లో రాత్రి బస చేశారు. అక్క‌డే నిన్న రాత్రి ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో స‌మీక్ష జ‌రిపారు. ఇవ్వాల ఉద‌యం హెల‌క్యాప్ట‌ర్‌లో భ‌ద్రాచ‌లం వెళ్లాల్సి ఉండ‌గా.. వాతావ‌ర‌ణం అనుకూలించ‌లేదు. దీంతో రోడ్డు మార్గాన ఏటూరు నాగారం వెళ్తున్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.

హనుమకొండ నుంచి రోడ్డు మార్గాన ఏటూరునాగారం బయల్దేరారు. అయితే షెడ్యూల్‌ ప్రకారం హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వే చేయాల్సి ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణం నేపథ్యంలో రోడ్డు మార్గంలో వెళ్తున్నారు. గూడెపహడ్‌, ములుగు, గోవిందరావుపేట మీదుగా ఏటూరునాగారం చేరుకుంటారు. దాదాపు 4 గంటలపాటు రోడ్డు మార్గం ద్వారానే వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం ఏటూరు నాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలో వరద పరిస్థితిపై ప్రజాప్రతినిథులతో సమీక్ష నిర్వహిస్తారు. మంత్రులు, అధికారులకు సూచనలు చేయనున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం వెంట మంత్రులు హ‌రీశ్‌రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, స‌త్య‌వ‌తిరాథోడ్‌, సీఎస్ సోమేశ్ కుమార్‌, డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి, సీఎం కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్ త‌దిత‌రులున్నారు.

వరంగల్​ జిల్లా కటక్షాపూర్​ వద్ద అలుగుపారుతున్న చెరువు.. రోడ్డు మార్గంలో కాన్వాయ్​లో వెళ్తున్న సీఎం కేసీఆర్​, అధికారులు

Advertisement

తాజా వార్తలు

Advertisement