Friday, May 10, 2024

Breaking: ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యా ప్రయత్నం.. వ్యక్తి అరెస్ట్

తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూరు నియోజకవర్గం ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యా ప్రయత్నానికి ప్లాన్ జరిగినట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటి వద్ద గుర్తుతెలియని ఒక వ్యక్తి తచ్చట్లాడుతూ కనిపించాడు. సదరు వ్యక్తి వద్ద కత్తి, పిస్తోలు కూడా ఉండటంతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నం 12 లోని వేమూరీ ఎన్ క్లేవ్‌లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్మూర్‌కు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్తే ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు సమాచారం. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో సదరు నిందితుడు కక్ష్య పెంచుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఒక కత్తి, పిస్తోలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement