Friday, April 26, 2024

Spl Story: హైదరాబాద్​లో ఇయర్​ ఎండింగ్​ జోష్​.. అర్మాన్​ మాలిక్​ కాన్సర్ట్​కి ఏర్పాట్లు!

2022వ సంవత్సరం ఎండింగ్​లో ఉంది.. మరో రెండ్రోజుల్లో డిసెంబర్​ నెల ప్రారంభం కానుంది. ఇక ఇప్పటి నుంచే ఇయర్​ ఎండింగ్​ పార్టీలకు ప్లాన్​ చేస్తున్నారు చాలామంది నిర్వాహకులు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో యువతీ, యువకులు కూడా పార్టీలు, పబ్​లు అంటూ మాంచి జోష్​ మీదున్నారు. వారి అలవాట్లను ఆసరాగా చేసుకుని కొంతమంది నిర్వాహకులు అయితే స్పెషల్​ పార్టీలను కూడా ప్లాన్​ చేస్తున్నారు. అందులో భాగంగా బాలీవుడ్​ సింగర్​ అర్మాన్​ మాలిక్​ కాన్సర్ట్​కి హైదరాబాద్​ రెడీ అవుతోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ​

2022 సంవత్సరం ముగుస్తున్నందున పార్టీ సీజన్ అధికారికంగా ప్రారంభమైందనే అంటున్నారు చాలామంది. హైదరాబాద్​ వంటి విశ్వనగరం ఎందులోనూ వెనుకబడి లేదు. ఇందుకు సిటీలో గ్రేట్​ సింగర్స్​ అయిన అలాన్ వాకర్, ప్రతీక్ కుహద్ వంటి వారు కాన్సర్ట్​లు నిర్వహిస్తున్నారు. అట్లనే ఫేమస్​ DJ స్నేక్‌లతో హైదరాబాద్‌లో అనేక సంగీత కచేరీలు జరుగుతున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ నుండి మరో బిగ్​ సింగర్అర్మాన్​ మాలిక్​ ​ కోసం హైదరాబాద్​ రెడీ అవుతోంది. ఆ సింగర్​ ట్యూన్‌ల కోసం యువత ఎదురుచూస్తుందనే చెప్పవచ్చు.  

అవును! అర్మాన్ తన ఆల్ ఇండియా టూర్ ‘నెక్స్ట్ 2 యూ’లో భాగంగా హైదరాబాద్​ రానున్నాడు. డిసెంబర్ 3న హైదరాబాద్‌లో ప్రదర్శన జరగబోతోంది. దీనికి సంబంధించిన టిక్కెట్లు ఇప్పటికే బుక్ మై షో, Paytm ఇన్‌సైడర్‌లోఅందుబాటులో ఉన్నాయి. అర్మాన్​ మాలిక్ ఇప్పటికే నాలుగు ప్రధాన నగరాలైన బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, ముంబైలలో ప్రదర్శన ఇచ్చాడు. హైదరాబాద్‌లో చివరి ప్రోగ్రామ్​ ఇవ్వడం ద్వారా తన 2022వ సంవత్సరంలో పర్యటనను ముగించాలని ప్లాన్​ చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్​లోని గండిపేట హార్డ్​కప్​ కాఫీ ఏరియాలో అర్మన్​ మాలిక్​ షో ఉండనున్నట్టు సమాచారం అందుతోంది.

జబ్ తక్, బోల్ దో నా జరా, మే రాహు యా నా రాహు అనే కొన్ని ఎవర్‌గ్రీన్ పాటలతో అర్మాన్ మాలిక్ సంగీత ప్రియులను ఊర్రూతలూగించాడు. అందుకని హైదరాబాదీ అభిమానులు అతనిని రాక్ చేయడం కోసం వెయిట్​ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement