Friday, May 10, 2024

మేం గెలవడమా.. ప్రపంచ నాశనమా.. పుతిన్ స‌ల‌హాదారు అఎగ్జాండ‌ర్ డుగిన్

ర‌ష్యా గెలిచిన త‌ర్వాతే యుద్ధం ఆగుతుంద‌ని..అప్ప‌టి వ‌ర‌కు దాడులు కొన‌సాగుతూనే ఉంటాయ‌ని స్పష్టం చేశారు ర‌ష్యా అధినేత పుతిన స‌ల‌హాదారుడు. లేదంటే ప్రపంచ వినాశనం తప్పదని హెచ్చరించారు. ఈమేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సలహాదారు అలెగ్జాండర్ డుగిన్ తాజాగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన రష్యా అధ్యక్షుడి ఆలోచనలకు ప్రతిరూపంగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం యుద్ధం బహుళ ధ్రువ ప్రపంచం దిశగా సాగుతోందని డుగిన్ చెప్పారు. ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధమని చెప్పారు.

ఈ యుద్ధం పశ్చిమ దేశాలకో, మరే ఇతర దేశాలకో వ్యతిరేకంగా జరుగుతున్నది కానే కాదని ఆయన స్పష్టం చేశారు. యుద్ధ ప్రభావం ప్రపంచంపై ఎలా ఉండబోతోంది, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని విలేఖరులు అడగగా.. రష్యా గెలిచిన వెంటనే యుద్ధం ఆగిపోతుందని డుగిన్ చెప్పారు. అయితే, అదంత సులువు కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచం నాశనమైతే ఉక్రెయిన్.. రష్యా యుద్ధం ఆగిపోతుందని వివరించారు. మేం గెలవడమా.. ప్రపంచ నాశనమా.. రెండింటిలో ఏదో ఒకటి జరగనిదే యుద్ధం ఆగదని డుగిన్ స్పష్టంచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement