Wednesday, May 1, 2024

Big Offer: ఆపిల్ ఐఫోన్ ఇంత అగ్గువ‌కేనా.. 30వేల కన్నా తక్కువలోనే 12 మినీ

స్మార్ట్​ఫోన్లలో ఆపిల్ ఐఫోన్లకు ఉండే ప్రత్యేకతే వేరు. చాలా మందికి ఐఫోన్​ కొనాలని ఉన్నా ధర ఎక్కువ అనే కార‌ణంగా కొన‌లేక‌పోతుంటారు. అయితే ఐఫోన్లపై ఆఫర్లు వ‌చ్చిన‌ప్పుడు మాత్రం చాలామంది కొనేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ఈసారి గుడ్​ న్యూస్ చెప్పింది ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్. అదిరే ఆఫర్​తో అగ్గువ‌కే ఐఫోన్లను విక్రయిస్తోంది. ఐఫోన్​ 12 మినీపై ప్రస్తుతం ఈ స్పెషల్ ఆఫర్లను ప్ర‌క‌టించింది ఫ్లిప్​కార్ట్. చిన్న డిస్​ప్లే, భారీ ఫీచర్లతో ఉన్న‌ ఈ స్మార్ట్​ఫోన్ 64 జీబీ వేరియంట్ ధర మార్కెట్లో రూ.59,900గా ఉంది. అయితే ఫ్లిప్​కార్ట్ ప్రస్తుతం దీనిపై 30శాతం డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. అంటే దీన్ని 41,999కు కొనుగోలు చేయొచ్చు. ఇక ఈ స్పెషల్ డిస్కౌంట్​తో పాటు ఎక్స్ఛేంజ్​, బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఎక్స్ంజ్ ఆఫర్​లో పాత ఫోన్​ను వెనక్కి ఇచ్చేయడం ద్వారా మరో 13,000 దాకా తగ్గింపు పొందొచ్చని ఫ్లిప్​కార్ట్​ పేర్కొంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్స్ఛేంజ్ చేసే స్మార్ట్​ఫోన్ కండిషన్​, మోడల్​ వంటి వాటిని బట్టి దాని విలువ లెక్క గ‌డ‌తారు. త‌క్కువ‌లో త‌క్కువ 13 వేల దాకా తగ్గింపు పొందొచ్చు.

ఒకవేళ స్మార్ట్​ఫోన్ ఎక్స్ఛేంజ్​లో మొత్తం విలువ లభిస్తే.. ఐఫోన్ 12 మినీ 64 జీబీ వేరియంట్​ను 28,999కే కొనొచ్చు. ఇక దీనికి బ్యాంక్ ఆఫర్లు కూడా తోడైతే ఈ ధర మరింత త‌గ్గే అవ‌కాశం ఉంది.

ఐఫోన్ 12 మిని 256 జీబీ ధర ఎంత తగ్గనుందంటే..
ఈ వేరియంట్​పై 25శాతం తగ్గింపు ఇస్తోంది ఫ్లిప్​కార్ట్. ఈ ఆఫర్​తో 74,900 విలువైన ఈ స్మార్ట్​ఫోన్​ను 55,999కే కొనే వీలుంది. ఈ మోడల్​కు కూడా ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.13 వేల దాకా తగ్గింపు పొందే చాన్స్ ఉంది. ఈ ఆఫర్ పూర్తిగా లభిస్తే క‌నుక‌ ఈ వేరియంట్​ను 42,999కే పొందొచ్చు. దీనికి బ్యాంక్ ఆఫర్లు కలిస్తే ధర మరింత తగ్గుతుంది.

ఐఫోన్ 12 మిని ఫీచర్లు..
5.4 అంగుళాల డిస్​ప్లే (ఓఎల్ఈడీ డిస్​ప్లే)
వెనకవైపు రెండు కెమెరాలు (12 ఎంపీ+12 ఎంపీ)
12 ఎంపీ సెల్ఫీ కెమెరా
ఏ 14 బయోనిక్ చిప్​సెట్​
బ్లాక్ కలర్​ వేరియంట్​
5జీ సపోర్ట్​
డ్యుయల్ సిమ్​ (ఒకటి మైక్రో, రెండవది ఈ-సిమ్​)
2,227 ఎంఏహెచ్ బ్యాటరీ

Advertisement

తాజా వార్తలు

Advertisement