Thursday, May 2, 2024

ఎల్లుండి ఇడుపులపాయలో ఏం జరగబోతోంది?

దివంగత నేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అటు వైఎస్ జగన్, ఇటు షర్మిల తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది వైఎస్ఆర్ జయంతి నాడు షర్మిల తన కొత్త పార్టీ స్థాపించబోతున్నారు. ఆ రోజే పార్టీపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈనెల 8న ఉదయం ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి అనంతరం హైదరాబాద్‌ చేరుకుని పార్టీ పేరు, జెండా, ఎజెండాను ప్రకటించేలా ప్లాన్ చేసుకున్నారు.

అయితే అన్న జగన్‌తో విభేదాల కారణంగానే తెలంగాణలో షర్మిల వేరు కుంపటి పెట్టుకున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ జయంతి రోజు అన్నాచెల్లెళ్లు ఒకేసారి సమాధి వద్ద నివాళులు అర్పించి పుకార్లకు చెక్ పెడతారా? లేదా విడివిడిగా వచ్చి విబేధాలు నిజమేనని స్పష్టం చేస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది. అందుకే ఈసారి వైఎస్ జయంతి రోజు ఇడుపులపాయలో ఎలాంటి సన్నివేశం చోటుచేసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జగన్, షర్మిల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇప్పటికే విజయమ్మ ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 8న ఏం జరగబోతుందో వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీకి సీబీఐ కోర్టు జరిమానా.. ఎందుకంటే?

Advertisement

తాజా వార్తలు

Advertisement