Tuesday, May 7, 2024

నాని 28వ చిత్రం అంటే సుంద‌రానికీ – సెన్సార్స్ కంప్లీట్

విభిన్న క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకి వ‌స్తున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని..ఆయ‌న న‌టించిన 28వ చిత్రం అంటే సుంద‌రానికీ ..ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. నాని నటించిన 28వ చిత్రం ఇది. ఈ నెల 10న విడుదల కానున్న సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వివేక్ సాగర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ హిలేరియస్ గా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చక్కగా ఈ చిత్రాన్ని చూసేయొచ్చని మేకర్స్ తెలిపారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కింది..మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా ద్వారా మలయాళం బ్యూటీ నజ్రియా ఫహద్ ఫాజిల్ తెలుగులో పరిచయం అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement