Saturday, May 4, 2024

భీమ్లా నాయక్’లో మరో క్రేజీ ఎడిషన్ – కైలాశ్ ఖేర్ తో సాంగ్

భీమ్లా నాయ‌క్ ఈ చిత్రాన్ని సాగ‌ర్ కె చంద్ర తెర‌కెక్కిస్తున్నాడు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్నాడు. కాగా సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించాడు. తమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే పాప్యులర్ అయ్యాయి. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఈగో వార్. మరో హీరోగా డేనియల్ శేఖర్ పాత్రలో రానా నటించాడు. పవన్ సరసన నిత్యామీనన్ .. రానా జోడీగా సంయుక్త మీనన్ అలరించనున్నారు. ఈ సినిమాకి రెండు రిలీజ్ డేట్లు అనుకున్నారు. త్వరలోనే ఒక రిలీజ్ డేట్ ను ఖరారు చేయనున్నారు.తాజాగా మరో పాట పాడటానికి కైలాశ్ ఖేర్ ను తీసుకున్నారు.మా సెన్సేషనల్ ‘భీమ్లా నాయక్’లో మరో క్రేజీ ఎడిషన్ .. ఈ సినిమాలో ఒక పాటను పాడటానికిగాను కైలాశ్ ఖేర్ ను త్రివిక్రమ్ తీసుకొచ్చారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రిగారు రాశారు” అని చెబుతూ, ఆ సందర్భంలో దిగిన ఒక ఫొటోను తమన్ పోస్ట్ చేశాడు. అయితే ఈ సినిమాలో ఏదైనా సందర్భంలో ఒక పాట ఉంటే బాగుంటుందని భావించి కొత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారేమోనని అనిపిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement