Thursday, May 2, 2024

Covid Vaccination: అండమాన్ నికోబార్‌ దీవుల్లో 100 శాతం వ్యాక్సినేషన్

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది.  వ్యాక్సినేషన్ లో అండమాన్​ నికోబార్‌ దీవులు కీలక మైలురాయిని అందుకుంది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మాత్రం 100శాతం వ్యాక్సినేషన్‌ అందించారు. అర్హులందరికీ రెండు డోసుల వ్యాక్సిన్‌ అందినట్లు అక్కడి పాలకవర్గం వెల్లడించింది. కొవిషీల్డ్‌ టీకాతో 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న తొలి కేంద్రపాలిత ప్రాంతంగా అండమాన్‌ నికోబార్‌ నిలిచింది.

ఉత్తరం నుంచి దక్షిణం వరకు 800 కి.మీ విస్తీర్ణంలో ఉన్న 836 దీవులకు చేరుకొని వ్యాక్సిన్లు అందజేశామని ప్రతికూల వాతావరణంలోనూ టీకాలు అందజేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైన జనవరి 16నే ఈ దీవుల్లో కూడా టీకాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మొత్తం 2.87 లక్షల మంది అర్హులు రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ దీవుల్లో మొత్తం జనాభాలో 74.67 శాతం మంది టీకాలు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement