Friday, May 17, 2024

ఎనిమిదేళ్ల చిన్నారి – కోట్ల రూపాయ‌ల సంపాద‌న – ఎలాగంటే

ఎనిమిదేళ్ల వ‌య‌సులోనే ఓ చిన్నారి కోట్ల రూపాయ‌ల‌ను సంపాదిస్తోంది. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా..ఇది అక్ష‌రాల నిజ‌మండీ. రష్యాకు చెందిన అనస్తాషియా రజిన్స్ కాయా కోట్లు సంపాదిస్తోంది. వరుసగా కొన్నేళ్ల నుంచి అత్యధిక వార్షికాదాయం పొందుతున్న చిన్నారి యూట్యూబర్ గా ఆమె రికార్డులను తిరగరాస్తోంది. గత ఏడాది కూడా ఆమె రూ.200 కోట్లను తన యూట్యూబ్ చానెళ్ల ద్వారా సంపాదించింది. తద్వారా 2021లో అత్యధిక ఆదాయం పొందిన చిన్నారిగా రికార్డు సృష్టించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 చానెళ్లను ఆమె ఏకధాటిగా నిర్వహించడం మామూలు విషయం కాదు. ప్రధానంగా ‘లైక్ నాస్త్య’ అనే ఆమె నిర్వహిస్తున్న చానెల్ ప్రధానమైంది. ఆ చానెల్ కు 8.6 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉండడం విశేషం. మొత్తంగా ఆమె యూట్యూబ్ చానెళ్లకు 26 కోట్ల మంది సబ్ స్క్రయిబర్లున్నారు. అయితే, అంత ఆస్తి ఉన్నా.. ఎంత సంపాదించినా.. ఆ చిన్నారి చిన్నప్పుడే సెరిబ్రల్ పాల్సీ జబ్బు బారిన పడడం విషాదం. ఎప్పటికీ ఆమె మాట్లాడే అవకాశం లేదని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారట. దీంతో 2015లో వారు ఓ యూట్యూబ్ చానెల్ ను ప్రారంభించి.. చిన్నారితో మాట్లాడించే ప్రయత్నం చేశారట. అలా కొద్దిరోజుల్లోనే అనస్తాసియా మాట్లాడం నేర్చుకుందట. ఆ తర్వాతి ఏడాదే మరో చానెల్ ను పెట్టి మరింత ప్రోత్సహించారట. చిన్నచిన్నగా బొమ్మల రివ్యూను ఇవ్వడం ప్రారంభించారట. అలా అలా ఆమె సంపాదన మొదలుపెట్టింది. అత్యధిక సంపాదన పొందిన చిన్నారిగా పేరు తెచ్చుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement