Sunday, June 23, 2024

‘ప్రాజెక్ట్ కె’ కోసం భారీ వెహిక‌ల్స్ – ఆనంద్ మ‌హీంద్రాకి ట్వీట్ చేసిన ద‌ర్శ‌కుడు

ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో ఓ భారీ మూవీని తెర‌కెక్కించ‌నున్నాడు. కాగా ఈ చిత్రానికి ప్రాజెక్ట్ కే అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. సైన్స్ – ఫిక్షన్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అత్యాధునిక భారీ వెహికల్స్ ను వినియోగించనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఆ వాహనాలను తయారు చేయించే పనిలో ఉన్నాడు నాగ్ అశ్విన్ . ఇందు కోసం ప్రముఖ కంపెనీ మహీంద్రా గ్రూప్ ను సంప్రదించారు. కంపెనీ సహకారం కోరుతూ అశ్విన్ తాజాగా ట్విట్టర్ లో మహీంద్రా గ్రూప్ హెడ్ ఆనంద్ మహీంద్రాను అభ్యర్థించారు. ప్రియమైన ఆనంద్ మహీంద్రా సార్.. మేము ది గ్రేట్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్ , దీపికతో కలిసి ProjectK అనే భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ఈ మూవీలో వినియోగించబోయే వాహనాలు ప్రస్తుత టెక్నాలిజీతో రూపుదిద్దుకోలేవు. ఇందుకు మీ వద్ద ఉన్న ప్రముఖ ఇంజనీర్లను, డిజైనర్ల బృందం సహకారం అవసరం ఉంది. ఇందుకు స్పందించి మాకు సహాయం చేస్తే గౌరవంగా ఉంటుంది’.. అని ట్వీట్ చేశారు. బాహుబలి విజయం తర్వాత ప్రభాస్ , మహీంద్రా TUV300 ప్రకటనలో నటించారు. ఈ మేరకు మహీంద్రా కంపెనీ హెడ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement